VIDEO: కారు బోల్తా పడి ముగ్గురికి స్వల్ప గాయాలు

VIDEO: కారు బోల్తా పడి ముగ్గురికి స్వల్ప గాయాలు

ASF: వాంకిడి మండలంలోని NH-363పై బుధవారం కారు టైరు పగిలి బోల్తా పడింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కారు గణేష్ పూర్ గ్రామ సమీపంలో టైర్ పగిలి పల్టీ కొట్టి రోడ్డు పక్క పడింది. కారులో ముగ్గురు పెద్దవాళ్లు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ముగ్గురు స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు.