'నీ రేటెంత? అని అడుగుతున్నారు: నటి

'నీ రేటెంత? అని అడుగుతున్నారు: నటి

పాపులారిటీ వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని మరాఠి నటి గిరిజ ఓక్ తెలిపింది. పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదని, కానీ నెగటివ్, అసభ్యకర కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పింది. 'నీ రేటెంత?, గంటసేపు గడపాలంటే ఎంత? వంటి మెసేజ్‌లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. రియల్‌గా కలిస్తే గౌరవంగా మాట్లాడుతారని, ఆన్‌లైన్‌లో మాత్రం ఇలా మాట్లాడుతారని పేర్కొంది.