కడప జిల్లాలో 2,661 హెక్టార్లలో పంట నష్టం
KDP: వర్షాల వల్ల కడప జిల్లాలోని 63 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా (DAO) చంద్ర నాయక్ తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. 2,661 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వరి-1,970 హెక్టార్లు, కంది-258 హెక్టార్లు, మినుము-228 హెక్టార్లు, వేరు శనగ-84 హెక్టార్లు, పత్తి-81 మొక్కజొన్న- 40 హెక్టార్లలో దెబ్బతిన్నాయన్నారు.