జాతీయ స్థాయిలో JRF సాధించిన రాజోలి విద్యార్థి
GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి రంగస్వామి జాతీయ స్థాయిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించి సత్తా చాటాడు. తెలుగు భీమన్న కుమారుడైన రంగస్వామి ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. ఇటీవల యూజీసీ నిర్వహించిన నెట్ పరీక్షలో చరిత్ర సబ్జెక్టు విభాగంలో పోటీపడి JRF సాధించాడు.