ఏడుపాయలలో ఆకాశదీపం ఆవిష్కరణ
MDK: కార్తీక మాసం పురస్కరించుకొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం ప్రాంగణంలో ఆకాశదీపం ఆవిష్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం ఆలయ కమిటీ అర్చక బృందం తెలిపారు. అంతకుముందు ఆలయంలో ప్రదోషకాల పూజలు మంగళహారతి నిర్వహించారు.