అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన

అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావ్ సహకారంతో అంగన్వాడి భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గాజుల రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్, గ్రామ కార్యదర్శి సరిత పాల్గొన్నారు.