వీసీ సజ్జనార్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

వీసీ సజ్జనార్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

HYD: ఈనెల 27న నగరంలో జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు రాజాసింగ్ ఓ లేఖ రాశారు. శోభయాత్రకు ఎలాంటి పోలీసు భద్రత వద్దంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసు భద్రత పేరుతో గతంలో భక్తులపై లాఠీచార్జీలు జరిగాయని, భక్తులను ఇబ్బందులకు గురిచేసే రక్షణ తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.