మహిళను వేధించిన ముగ్గురు మైనర్లు
MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ వివాహిత మహిళను ముగ్గురు మైనర్లు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతిఘటించిన మహిళకు గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకోగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.