జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
గద్వాల జిల్లా సమీపంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి అమావాస్య, శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి, మంగళ హారతులు, కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.