కేజీబీవీ ఎస్వో సస్పెండ్
ASR: కొయ్యూరు రాజేంద్రపాలెం కేజీబీవీ ఎస్వో (స్పెషల్ ఆఫీసర్)ఏ. పరిమళ సస్పెండ్ అయ్యారు. ఇటీవల కేజీబీవీ నుంచి అక్రమంగా సరుకులు తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమగ్ర ఏపీసీ స్వామినాయుడు వచ్చి, విచారణ జరపగా, అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఎస్వో పరిమళను సస్పెండ్ చేసినట్లు ఏపీసీ బుధవారం తెలిపారు.