‘దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం'
ప్రకాశం: ఒంగోలులో లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఆయన బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్పర్శజ్ఞానంతో అంధులు చదవడానికి, రాయడానికి వీలుగా లిపిని రూపొందించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు.