VIDEO: అడ్డాకుల రోడ్ల దుస్థితిపై రైతుల ఆవేదన

VIDEO: అడ్డాకుల రోడ్ల దుస్థితిపై రైతుల ఆవేదన

MBNR: అడ్డాకుల మండలంలోని పొలాలకు వెళ్లే రహదారులు గుంతలు, బురదతో దారుణంగా మారి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల ప్రభావంతో రోడ్లు అస్తవ్యస్తమై వాహనాలు నడపడం కష్టంగా మారిందని వారు తెలిపారు. రాత్రిపూట చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్పందించి రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.