పత్తి పంటలో గంజాయి సాగు
ASF: కెరమెరి మండలం పరంధోళి గ్రామంలో గాయక్ వాడ్ శివాజీ తన పొలంలో పత్తి పంటతో పాటు గంజాయి సాగు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించగా 28 గంజాయి మొక్కలు లభ్యం అయ్యాయి. దీంతో మొక్కలను స్వాధీనం చేసుకొని అతనిపై నమోదు చేసినట్టు ఎస్సై మధుకర్ తెలిపారు.