మాడుగులపల్లిలో మంత్రి ఎన్నికల ప్రచారం
NLG: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మాడుగులపల్లి మండలంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి, గ్రామాలు అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.