నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి

కర్నూలు: నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని బేతంచర్ల మండల సీ.ఐ ప్రీతం రెడ్డి, ఎస్సై శివ శంకర్ నాయక్ తెలిపారు. గురువారం నాడు బేతంచెర్ల పట్టణంలోని పురవీధుల గుండా CAPF బృందం, బేతంచర్ల పోలీస్ బృందం కవాతు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన వీధులలో కవాతు నిర్వహించారు.