శ్రీ బాలాజీ పరపతి సంఘం వార్షికోత్సవ వేడుకలు

WGL: శ్రీ బాలాజీ పరపతి సంఘం 52వ వార్షికోత్సవం ఖిలా వరంగల్‌లో మున్నూరుకాపు భవనంలో ఆదివారం ఉదయం సంఘం అధ్యక్షుడు గాండ్ల అజయకుమార్ అధ్యక్షతన 10గంటలకు జరిగింది. సంఘానికి సంబంధించిన లావాదేవీలను కార్యదర్శి సభ్యులకు వివరించడం వారుఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సంఘం 1972లో స్థాపించడం జరిగిందని, 52సంవత్సరాలుగా సభ్యుల సహకారంతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నామన్నారు.