చింతల హనుమాన్ ఆలయంలో పల్లకి సేవ

WNP: పట్టణంలోని శ్రీ చింతలహనుమాన్ ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆదివారం విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి మాలధారణస్వాముల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకిసేవ నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొని ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. కమిటీసభ్యులు బలరాం వెంకటేష్ పాల్గొన్నారు.