జిల్లా మహిళా కబడ్డీ జట్టుకు పాకల విద్యార్థినిలు ఎంపిక

జిల్లా మహిళా కబడ్డీ జట్టుకు పాకల విద్యార్థినిలు ఎంపిక

ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టుకు ఐదుగురు పాకల క్రీడాకారిణులు ఎంపికైనట్లు కోచ్ హజరత్తయ్య తెలిపారు. ఎంపికైన వారు కాకినాడలో మే 2 నుంచి మే 5 వరకు జరిగే 12వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరావు, కార్యదర్శి పూర్ణచంద్రరావులకు కృతజ్ఞతలు తెలిపారు.