హజ్ యాత్రికులకు ఘన సన్మానం

నిర్మల్: ముస్లింల పవిత్రతకు చిహ్నమైన హజ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులను శుక్రవారం నిర్మల్ జిల్లా భైంసాలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ముస్లిం సోదరులు జీవితంలో ఒక్కసారైన హజ్ సందర్శనకు వెళ్ళి జీవితాన్ని పవిత్రం చేసుకోవాలన్నారు. హజ్ యాత్రకు వెళుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.