VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

BDK: జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.