గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

ADB: గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన భీంపూర్ మండల పరిధిలోని ఆర్లిటికిలో వెలుగుచూసింది. ఆర్లిటికి చెందిన మీరాబాయి గంజాయి నిల్వచేసి విక్రయిస్తోందన్న సమచారం మేరకు దాడి చేసి, అరెస్టు చేసినట్లు సీఐ సాయినాథ్, ఎస్సై పీర్సింగ్ తెలిపారు. మహిళ ఇంట్లో 228గ్రా. ఎండు గంజాయితో పాటు పెరట్లో ఒక గంజాయి మొక్క లభించినట్లు వివరించారు.