ప్రధాన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
MDCL: యూనివర్సిటీలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని విద్యా కమిషన్ ఛైర్మన్‌కి ఓయూ SFI కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టూడెంట్స్ ఎన్నికలు నిర్వహించాలని, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సీఎం హామీ ఇచ్చిన రూ.1000 కోట్లు వెంటనే ఓయూ అభివృద్ధి కోసం విడుదల చేయాలని, తదితర విషయాలను విన్నవించినట్లు తెలిపారు.