మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొనుగోలు కేంద్రం కీలకంగా ఉపయోగపడనుందని అన్నారు .