కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన బైక్

కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన బైక్

W.G: పాలకొల్లు మండలం దిగమర్రు బస్ స్టాప్ సమీపంలో సోమవారం నర్సాపురం కానిస్టేబుల్ జి.శ్రీనివాస్ బైక్ పై వెళుతుండగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాల పాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.