అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
VZM: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో విజయనగరం మండలానికి కేటాయించిన శాఖా పరమైన నిధులపై ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిధులపై చర్చించి, తగు ప్రణాళికలను రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను మండలం అభివృద్ధికి కేటాయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.