అగ్నిప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం
కోనసీమ: ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రి పక్కన బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలలో తమ విలువైన వస్తువులు కోల్పోయామని బాధితులు అవేదన వ్యక్తం చేశారు.