MGUలో విద్యార్థులు ధర్నా
నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బాలికల హాస్టల్ విద్యార్థులు శనివారం తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం, త్రాగునీరు, భద్రత లోపాలపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తెలిపారు.