'బీఆర్ నాయుడును విధుల నుంచి తొలగించాలి'
VZM: టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన బీఆర్ నాయుడును వెంటనే విధుల నుంచి తొలగించాలని వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆశపు వేణు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని టీటీడీ కళ్యాణ మండపం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ బాధ్యతకు బీఆర్ నాయుడు ఎంతవరకు అర్హుడని వైసీపీ తరఫున సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.