పాస్టర్ ఇంట్లో సోదాలు
W.G: నరసాపురం మండలం పీచుపాలెంలోని పాస్టర్ గంటా జాన్ బాబురావు నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 2.27కోట్లను సీజ్ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి సరైన ఆధారాలు లేకుండా రూ.50 లక్షలు తెస్తుండగా బాబురావు అల్లుడు శాంసన్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణ చేపట్టి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా నోరు మెదపడం లేదు.