'పటకదవడ గ్రామానికి తారు రోడ్డు నిర్మించండి'
ASR: హుకుంపేట మండలంలోని పటకదవడ గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం నిర్మించిన మట్టి రోడ్డు గత నెలలో కురిసిన మొంథా తుఫాన్ కారణంగా కోతకు గురై కొట్టుకుపోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పటకదవడకి తారు రోడ్డు నిర్మించి తమ రవాణా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.