ఘాట్ రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు
ASR: ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రమాదకర ప్రదేశాల్లో ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు పోలీసు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డౌనూరు నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఘాట్ రోడ్డులో హెచ్చరికలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు సీఐ బీ.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ప్రమాదకర ప్రదేశాల్లో ఆగవద్దని సూచించారు.