స్వర్ణలో డ్రైనేజీ నిర్లక్ష్యం.. గ్రామస్థుల ఆగ్రహం

స్వర్ణలో డ్రైనేజీ నిర్లక్ష్యం.. గ్రామస్థుల ఆగ్రహం

BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామ తూర్పు బజార్‌లో కాలువలు శుభ్రం చేయకపోవడంతో నీటి పారుదల నిలిచిపోయింది. దీంతో మురుగు నీరు నిల్వై దోమలు విపరీతంగా పెరిగాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.