'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

PPM: వెంకట్రాయుడు పేట గ్రామంలో డా.శ్రీకాంత్ సంచార చికిత్స వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. వర్షాలు కురుస్తున్న కారణంగా వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా ఇంటింటి ఫీవర్ సర్వే పక్కగా చేపట్టాలన్నారు. వర్షా కాలంలో పరిసరాలను పరిశుభ్రంగా, నీటి నిల్వలు లేకుండా ఉంచుకోవాలన్నారు.