VIDEO: కోతులను తరిమేందుకు సర్పంచ్ చింపాంజీ వేషధారణ
BHNG: గుండాల మండలంలోని వెల్మజాల గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఇండ్లలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ప్రజలు అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో కోతులను తరిమేందుకు గ్రామ సర్పంచ్ కురిమిల శ్రీను చింపాంజీ వేషధారణ ధరించారు. ఈ సమస్యపై సర్పంచ్ స్వరయంగా స్పందించడంపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.