డీసీసీబీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి

డీసీసీబీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి

శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును జిల్లా నూతన డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన శివాల సూర్యం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సూర్యంకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యం మాట్లాడుతూ.. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానన్నారు.