కనిగిరిలో పిచ్చికుక్క స్వైర విహారం.. 21 మంది పై దాడి

కనిగిరిలో పిచ్చికుక్క స్వైర విహారం.. 21 మంది పై దాడి

ప్రకాశం: కనిగిరి పట్టణంలో శుక్రవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో 21 మంది వరకు గాయపడ్డారు. వీరిని కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పిచ్చికుక్కను తర్వరగా పట్టుకోకపోతే మరింతమందిపై దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.