VIDEO: ఘనంగా గాడిచర్ల జయంతి

SKLM: లావేరు శాఖా గ్రంధాలయములో ''చదవడం మాకిష్టం'' కార్యక్రమంలో భాగంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలిత గాడి చర్ల చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాడి చర్ల గ్రంధాలయ ఉద్యమానికి ఎంతో కృషి చేశారని అన్నారు.