భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
NLR: ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానం చేసి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా.. భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. ఆలయాలకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.