చెత్తను కాలువల్లో వేయకూడదు: ఎమ్మెల్యే

చెత్తను కాలువల్లో వేయకూడదు: ఎమ్మెల్యే

కడప: జిల్లాలోని 38వ డివిజన్ చిలకళబావి (మద్దఖ మసీద్) వద్ద కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నేతృత్వంలో "మన కడప-స్వచ్ఛ కడప" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె పరిసర ప్రాంతాలు పర్యటించి, కాలువల చెత్తను వెంటనే తొలగించాలని, ఫాగింగ్ కార్యక్రమాలు సమర్థంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా, చెత్త వాహనాలకే ఇవ్వాలని కోరారు.