నేడు ఆధార్ నమోదు క్యాంపు
ప్రకాశం: సి ఎస్ పురం మండల పరిధిలోని ఆర్కేపల్లి సచివాలయంలో బుధవారం ప్రత్యేక ఆధార్ నమోదు క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రతాపరెడ్డి తెలిపారు. సచివాలయ పరిధిలో ఆధార్ నమోదు చేసుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్కెపల్లి సచివాలయ పరిధిలోని గ్రామాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అనేకమంది ఆధార్ అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉందన్నారు.