'సింగంవారిపల్లిలోని పాఠశాలను తిరిగి ప్రారంభించండి'

అన్నమయ్య: నిమ్మనపల్లెలోని సింగంవారిపల్లిలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్తులు ఎంపీడీవో రమేష్ బాబు, ఎంఈవో పద్మావతిలను కోరారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల హాజరను జీరో చూపించి పాఠశాలను మూసి వేయించారన్నారు. ఈ పాఠశాలలో ఇప్పటికీ 14 మంది విద్యార్థులు ఉన్నారని, వెంటనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరారు.