'బాధిత కుటుంబానికి అండగా నిలిచిన దాతలు'
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాగి తిరుమల చారి గుండెపోటుతో ఇటీవల మరణించారు. ఆ కుటుంబ దినస్థితిని చూసి దాతలు సమకూర్చిన రూ. 32 వేల నగదును సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి, మాజీ సర్పంచ్ కడెం యాకయ్య, షాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఈరోజు వారి కుటుంబానికి అందజేశారు.