VIDEO: జనసంద్రమైన ఉయ్యూరు ప్రాంతం
కృష్ణా: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.దాదాపు 60 - 80 వేల మంది హాజరైనట్లు అధికారుల అంచనా వేశారు. SP వి.విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు విధుల్లో పాల్గొనగా, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగించారు.