సల్కలాపూర్‌లో ఆరు ఓట్ల తేడాతో గిరమ్మ విజయం
WNP: ఘణపురం మండలం సల్కలాపూర్ గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారురాలు గిరమ్మ ఉత్కంఠగా జరిగిన పోరులో కాంగ్రెస్ మద్దతుదారుపై ఆరు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారు కోరిక మేరకు రీకౌంటింగ్ నిర్వహించినా, గిరమ్మ స్వల్ప మెజారిటీతో గెలుపొందారని నేతలు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు చెరో ఐదు వార్డుల్లో గెలుపొందారు.