నంది నోటి నుంచి పారే జలపాతం ఇక్కడే

నంది నోటి నుంచి పారే జలపాతం ఇక్కడే

VKB: పెద్దేముల్ మండలం తట్టేపల్లి, పాషాపూర్ మధ్య ఉన్న శ్రీఅంబురామేశ్వర ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. అరణ్యవాస సమయంలో దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన బాణంతో భూమిలోంచి నీళ్లు తెప్పించాడని, ఆస్థలంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ ఆలయానికి ఆపేరు వచ్చింది.