సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 'సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం ఏమైంది. 4 నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదు. చికిత్సల ఖర్చుల పేరుతో పరిహారంలో కోత విధించారు. ఇచ్చిన మాటను సీఎం తప్పారు. సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోంది. ఈ ఘటనపై సిట్ వేయరు.. అరెస్టులు చేయరు' అని విమర్శించారు.