BJP నేతలకు CM రేవంత్ కౌంటర్

HYD: స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్య మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'మోదీ గారు రేవంత్ రెడ్డి విధానాలను అనుకరిస్తున్నారని కక్కలేక మింగలేక దుఃఖంలో ఉన్నారు' అంటూ BJP నేతలకు CM రేవంత్ కౌంటర్ వేశారు.