లంచ్ తర్వాత స్వీట్స్ తింటున్నారా?
భోజనం తర్వాత చాలామంది స్వీట్స్ తింటారు. అయితే అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత స్వీట్స్ తింటే క్యాలరీలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటికి బదులుగా చిన్న ముక్క 'బెల్లం' తింటే మంచిది. ఇది శరీరానికి ఐరన్ అందించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ తోడ్పడుతుంది.