అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా అభివృద్ధి పనులకు ఆదివారం MLA గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో TUFIDC నిధులతో కోటి రూపాయల వ్యయంతో కాంట కూడలి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతాయని పేర్కొన్నారు.