గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి

MBNR: పదర మండల పరిధిలోని ఉడిమిల్ల సమీపంలో అడవి ప్రాంతంలో గొర్రెలను మేపుతుండగా శనివారం ఉదయం గొర్రెల కాపరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గ్రామస్తులు గ్రామానికి తీసుకొచ్చి 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో గొర్రెల కాపర్లు భయాందోళనలకు గురయ్యారు.